టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే బదిలీలు చేప డతాం. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయి. టీచర్లు బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగా ల్సిన అవసరం లేదు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు బదిలీలు ఉంటాయి. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు.
– ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా, వారి అవసరాల మేరకే టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని కచ్చితంగా పాటిస్తూ బదిలీలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
Posted inGENERAL LATEST UPDATES