TS: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ

తెలంగాణ: హెల్త్ ఎమర్జెన్సీపై ఆర్డినెన్స్ జారీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల
వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం. తాజా ఆర్డినెన్సు తో
వచ్చే నెలలో కూడా జీతాలు, పెన్షన్ల కోత విధించనున్నట్లు తెలుస్తున్నది. హెల్త్
ఎమర్జెన్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స ను జారీ చేసింది. ఈ
ఆర్డినెన్స్ పై గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2005
డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంతో పాటు
పెన్షన్లలో ప్రభుత్వం కోత విధిస్తోంది. దీనిపై పెన్షనర్లు ప్రభుత్వ తీరును
నిరసిస్తూ కోర్టుకు సైతం వెళ్లారు. 

లాక్‌డౌన్ స‌మ‌యంలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉద్యోగులు.. చివ‌ర‌కు విశ్రాంత
ఉద్యోగుల ఫించన్ల‌లోనూ కోత పెట్టింది తెలంగాణ ప్ర‌భుత్వం.. లాక్‌డౌన్‌తో
ప్ర‌భుత్వానికి ఆదాయం త‌గ్గ‌డంతో కోత విధిస్తున్న‌ట్టు తెలిపారు.. దీనిపై
ఆర్డినెన్స్ కూడా తెచ్చింది స‌ర్కార్.. అయితే, విశ్రాంత ఉద్యోగుల ఫించన్‌లో కోతపై
హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.. ఏ చట్టం ప్రకారం ఫించన్‌లో కోత విధించారో తెలపాలని
ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు..  అయితే, వేతనాలు, ఫింఛన్ల కోతపై
ఆర్డినెన్స్ జారీ చేసినట్టు  హైకోర్టుకుతెలిపింది ప్ర‌భుత్వం.. మ‌రోవైపు,
ఆర్డినెన్స్ వివరాలు పిటిషనర్లకు ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది.. ఇక‌,
ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ పిటిషన్ సవరణకు అనుమతి కోరారు న్యాయవాది చిక్కుడు
ప్రభాకర్.. పిటిషన్లపై విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది హైకోర్టు.

Flash...   Restart of Personalized Adaptive Learning (PAL) Program in the State