YOUR WHATS APP NUMBERS IN GOOGLE SEARCH

గూగుల్‌ సెర్చ్‌లో మీ వాట్సాప్‌ నంబర్‌!

వాట్సాప్‌ యాప్‌లో మనకు కనిపించేవి కొన్ని ఫీచర్లు మాత్రమే. కానీ, తరచి చూస్తే
బోలెడు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే ‘క్లిక్‌ టు చాట్‌’ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా
యూజర్లు అవతలి వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను తమ ఫోన్లో సేవ్‌ చేసుకోకుండానే సందేశం
పంపొచ్చు. లేదా ఫోన్‌ చేయొచ్చు. సరిగ్గా ఇదే ఆ వాట్సాప్‌ యూజర్‌ను రిస్క్‌లో
పడేస్తుందని అంటున్నాడు బగ్‌ బౌంటీ హంటర్‌ అథుల్‌ జయరామ్‌. దీని ద్వారా మీ
వాట్సాప్‌ నంబర్‌ గూగుల్‌ సెర్చ్‌లో కనిపిస్తుందని చెబుతున్నాడు. ఈ మేరకు
‘థ్రెట్‌ పోస్ట్‌’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ఈ ఫీచర్‌లోని లోటుపాట్లను
వివరించాడు.


వాట్సాప్‌లో నంబర్‌ సేవ్‌ చేయకుండా చాట్‌ చేసేందుకు క్లిక్‌ చాట్‌ ఆప్షన్‌ను
వినియోగిస్తారు. https://wa.me/955×××××× నంబర్‌ను వినియోగించడం వల్ల గూగుల్‌
సెర్చ్‌లో ఆ ఫీచర్‌ మెటా డేటా కనిపిస్తుందట. దీనివల్ల సదరు యూజర్‌ తాలూకా ఫోన్‌
నంబర్‌ గూగుల్‌సెర్చ్‌లో దొరుకుతుందని చెబుతున్నాడు ఈ రీసెర్చర్‌. ఇలా తాను
సుమారు 3 లక్షల ఫోన్ నంబర్లను కనుగొన్నట్లు చెప్పాడు.

సెర్చ్‌లో దొరికితే ఏంటి నష్టం?


గూగుల్‌ సెర్చ్‌లో కేవలం ఫోన్‌ నంబర్‌ మాత్రమే దొరుకుతుందని, ఇతర వివరాలేవీ
లభించవని చెబుతున్నాడు ఈ హంటర్‌. అయితే, ఈ మాత్రం దొరికినా యూజర్లకు రిస్కేనని
చెబుతున్నాడు. మీ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా మీ ప్రొఫైల్‌ ఫొటోను కనుగొనచ్చని
(పబ్లిక్‌గా పెడితే) అంటున్నాడు. ఆ ఫొటోను రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా
యూజర్‌కు సంబంధించిన ఇతర సోషల్‌మీడియా ఖాతాల ద్వారా అతడి పూర్తి వివరాలు
తెలుసుకోవచ్చు. లేదా సదరు సైబర్‌ నేరగాడు నేరుగా సందేశాలు పంపించి మోసాలకు
పాల్పడొచ్చని చెబుతున్నాడు.


మే 23న ఈ బగ్‌ను సదరు రీసెర్చర్‌ కనుగొన్నాడు. బగ్‌ బౌంటీ ప్రోగ్రామ్‌ ద్వారా
వాట్సాప్‌ యూజర్‌ ఫేస్‌బుక్‌ను అతడు సంప్రదించగా… తమ ‘డేటా అబ్యూజ్
ప్రోగ్రామ్‌’ కిందకు వాట్సాప్‌ రాదని పేర్కొంది. అలాగే వాట్సాప్‌ సైతం దీనిపై
స్పందించింది. సదరు రీసెర్చర్‌ ఎంతో సమాయాన్నికోర్చి దీన్ని కనుగొన్నందుకు
అభినందిస్తున్నామని పేర్కొంది. అయితే, అది పూర్తిగా సెర్చింజన్‌ ఇండెక్స్‌కు
సంబంధించినది కావడంతో బగ్‌ బౌంటీ కార్యక్రమానికి అతడు అర్హత సాధించలేదని
తెలిపింది. అలాగే గుర్తుతెలీని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను బ్లాక్‌ చేసే
సదుపాయం యూజర్లకు తాము కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ గుర్తుచేసింది.
Flash...   Promate Xwatch B2: ట్రెండీ ఫీచర్లతో పవర్‌ఫుల్ స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే..