ఇంటర్నెట్‌ వినియోగదారులకు శుభవార్త

ముంబై: దేశీయ ఇంటర్నెట్‌ వినియోగదారులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది.
ప్రభుత్వం బ్రాండ్‌ బ్యాండ్‌ సర్వీసులకు లైసెన్స్‌ ఫీజులను తగ్గించబోతున్నట్లు
ట్రాయ్‌(టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ
నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను‌ అందుబాటులోకి రావచ్చు.
ప్రస్తుతం దేశంలో 1.98కోట్ల మంది వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను
ఉపయోగించుకుంటున్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని,
ప్రస్తుతం లైసెన్స్‌ ఫీజులు తగ్గిస్తే ప్రభుత్వానికి రూ.592 కోట్ల నష్టం
వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.కానీ, 10 శాతం బ్రాడ్ ‌బ్యాండ్‌ కంపెనీల
వృద్ధి రేటు పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలందించవచ్చని టెలికాం నిపుణులు
సూచిస్తున్నారు. 
బీఎస్‌ఎన్‌ఎల్ 82.3 లక్షల మంది వినియోగదారులతో మెదటి స్థానంలో ఉండగా, 
ఎయిర్‌టెల్ 2వ స్థానంలో(24.3 లక్షలు),  జియో ఫైబర్ (8.4 లక్షల) మంది
వినియోగదారులతో దేశంలోని బ్రాడ్ ‌బ్యాండ్ మార్కెట్లో ఐదవ స్థానంలో నిలిచింది.
కాగా దేశంలోని ప్రతి ఒక్కరికి జ్ఞానసముపార్జనకు బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు
విస్తరించడం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగానే ట్రాయ్‌ వినియోగదారులకు మెరుగైన
సేవలందించేందుకు అనేక చర్యలు చేపడుతన్నట్లు ట్రాయ్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు ట్రాయ్‌ అనేక సంస్కరణలు చేపట్టిన విషయం
తెలిసిందే. (చదవండి: వీరిలో సామాజిక ఒంటరితనం అధికం)
Flash...   Request to pay the Honorarium to NRSTC Volunteers and URH Staff during COVID – 19 (March & April 2020)