కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన ప్రపంచంలో ఆరో స్థానానికి భారత్.

రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో
ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.
అమెరికా, బ్రెజిల్‌ మాత్రమే మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24
గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత అధికంగా 5,355 మంది కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో
1.43 లక్షలకుపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా రికార్డే.

దేశంలో కొవిడ్‌ విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో
పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే కరోనాతో అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు
కరోనా బాధితుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా మనం దాటేశాం. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34
లక్షల కేసులు ఉండగా, ప్రస్తుతం భారత్‌లో బాధితుల సంఖ్య 2.36 లక్షలు దాటింది. దీంతో
కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి చేరింది.
తాజాగా 24 గంటల్లో మరో 9వేల మందికిపైగా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో
మునుపెన్నడూ లేనంతగా 295 మంది బలయ్యారు.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 139 మరణాలు నమోదయ్యాయి.
ఢిల్లీలో 58, గుజరాత్‌లో 35, తమిళనాడు 12, ఉత్తరప్రదేశ్‌ 12, పశ్చిమ్ బెంగాల్ 11
మంది కన్నుమూశారు. తాజా మరణాలన్నీ 17 రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. అందులో
మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ల వాటాయే 83.51 శాతంగా
ఉంది. మహారాష్ట్రలో కొత్తగా మరో 2,436 కేసులు బయటపడ్డాయి. తర్వాత తమిళనాడు 1,438,
ఢిల్లీ 1,336, గుజరాత్ 510, ఉత్తరప్రదేశ్ 502, కర్ణాటక 450, బెంగాల్ 427, హర్యానా
316, మధ్యప్రదేశ్ 234, రాజస్థాన్ 222, జమ్మూ కశ్మీర్ 182, చత్తీస్‌గఢ్ 106,
ఝార్ఖండ్ 96 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో
ఒకరకి పాజిటివ్‌గా తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది
మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా తమిళనాడు 28,694, ఢిల్లీ 26,334, గుజరాత్‌ 19,114
కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో పదివేల మార్క్ దాటింది. యూపీ, మధ్యప్రదేశ్‌లు
కూడా 10వేలకు చేరువగా వస్తున్నాయి. కేరళలో తొలిసారిగా పాజిటివ్ కేసులు మూడెంకెల
స్కోర్ దాటింది. అక్కడ శుక్రవారం 111 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పరిస్థితి
చేజారుతోందని భావించిన కేరళ సీఎం పినరయ్ విజయన్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లు
చేయాలని నిర్వహించారు. శనివారం 14వేల కిట్లను ఐసీఎంఆర్ అందజేయనుంది.

Flash...   Heart Attack : ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!