జియోఫైబర్ యూజర్స్‌కు బంపరాఫర్, ఏడాది అమెజాన్ ప్రైమ్ ఉచితం

అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో
తాజాగా జియో ఫైబర్ కస్టమర్లకు మరో బంపరాఫర్ తీసుకు వచ్చింది. రూ.999తో అమెజాన్
ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. జియో ఫైబర్ గోల్డ్,
అంతకుమించి ప్లాన్‌లో ఉన్న జియో ఫైబర్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ సభ్యత్వం వల్ల జియో ఫైబర్ యూజర్లు ఏమేం పొందుతారంటే.

 ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను
ఆస్వాదించవచ్చు…. అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం,
గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాళీ), ఉచితంగా, వేగవంతమైన డెలివరీ, టాప్
డీల్స్‌కు ముందే యాక్సెస్, ప్రైమ్ ఆడ్-ఫ్రీ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్
రీండింగ్ ఉన్నాయి
Flash...   Gas Booking పై cash back ఆఫర్ ...