ప్రభుత్వ ఉద్యోగుల 5 రోజుల పనిదినాలు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖాల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు  వర్తిస్తాయని ఆమె వెల్లడించారు. 
ఉద్యోగుల సమస్యలన్నింటిపై ముఖ్యమంత్రి జగన్‌ సానుకూలంగా స్పందిస్తున్నారని ఆమె అన్నారు. ఉద్యోగులకు మేలు చేసినందుకు ఏపీ ఉద్యోగుల సంఘం చైర్మన్‌  వెంకట్రామిరెడ్డి  సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు. 
Flash...   కొత్త Privacy Policy పై క్లారిటీ ఇచ్చిన Whatsapp