దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే కేసుల సంఖ్య
3లక్షలు దాటింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

ఇక ముంబై ఢిల్లీ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. బాధితులకు వైద్యం
అందించడానికి బెడ్లు కూడా సరిపోయే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో నిన్న అత్యవసర సమీక్ష
నిర్వహించారు.

ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
తదితరులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు
తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సమావేశంలో మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలా..అన్న అంశంపై కూడా చర్చించినట్టు
పీఎంఓ వర్గాల సమాచారం. అయితే కేసులు ఎక్కువగా వస్తున్న 5రాష్ట్రాల్లో లాక్ డౌన్
అమలు చేసి మిగతా రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చే దిశగా కూడా చర్చించినట్టు
తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నేడు దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించి ముఖ్యమంత్రి
అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ లతో అమిత్ షా భేటీ కావాలని వాస్తవ
స్థితిగతులను సమీక్షించాలని ప్రధాని ఆదేశించారు.ఇక ఇదే విషయమై ఈ నెల 16న ప్రధాని
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు.