మీకోసం నేను పోరాటం చేస్తా…! టీచర్లకు అండగా పవన్ కల్యాణ్..!

కరోనా కారణంగా ఆర్థిక రంగం బాగా దెబ్బ తినింది. ఎవ్వరి దగ్గరా తగినంత డబ్బు
లేకుండా పోయింది. ఆంధ్రలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు తమ స్కూల్ లో పాఠాలు బోధించే
టీచర్లకు వేతనాలు చల్లించడం లేదు. దాంతో వారు రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొంది.
పాఠాలు చెప్పే బడి పంతుళ్ళు పండ్లను కూరగాయలను తోపుడు బ్యాండ్లపై పెట్టుకొని
అమ్మే పరిస్థితి నెలకొంది. ఇది గమనించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయం పై
స్పందించారు.
ఇవాళ టీచర్ల పరిస్థితి బతకలేక బడిపంతుల్లాగా మారిందని ఆయన అన్నారు. చిన్నపాటి
స్కూళ్ళలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిందంటే నమ్మోచ్చు సంవత్సరానికి
పూర్తిగా ఫీజు ఒకేసారి తీసుకునే పెద్ద పాఠశాలలకు ఏం అయ్యింది అని ఆయన
ప్రశ్నించారు. ఇన్నాళ్ళు తమ స్కూల్ లలో పాఠాలు చెప్పిన టీచర్ల పరిస్థితి ఇప్పుడు
దారుణంగా మారిందని వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. టీచర్లకు
వేతనాలు తప్పనిసరి అని అలా ఇవ్వకపోతే తాను ముందుండి వారికోసం పోరాడతానని ఆయన హామీ
ఇచ్చారు. ప్రభుత్వం కూడా వారి పై దృష్టి వహించాలని నేటి బాలలే రేపటి పౌరులని
వారికి పాఠాలు చెప్పే టీచర్ల బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన అన్నారు.
Flash...   Implementation of National Population Education Project