లక్షకు చేరువలో “మహారాష్ట్ర” కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా
మరో 3607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి
వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 97,648కి చేరింది. 

ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 152 మంది మరణించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య
మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర
వ్యాప్తంగా 3590 మంది మరణించినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్
కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అందులో ముంబై నగరంలో
అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు
గురవుతున్నారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు స్థానిక ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో.. ఉద్దవ్
సర్కార్ మరోసారి లాక్‌డౌన్ విధిస్తామని హెచ్చరికలు కూడా చేశారు. మరోవైపు అక్కడ
పోలీసులకు కూడా పెద్ద ఎత్తున కరోనా సోకుతుండటం కలకలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్
సడలింపులతోనే కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైతే.. తిరిగి లాక్‌డౌన్‌
ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Flash...   AP గ్రామ సచివాలయాల్లో Dgital Payments