విద్యా శాఖ లో DyEO ల వ్యవస్థ రద్దు..?

ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 11: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యా శాఖలో పలు
సంస్క రణలు రానున్నాయి. డివిజన్ స్థాయిలో ఇప్పుడున్న ఉప విద్యాశాఖాధికారి (DYEO)ల వ్యవస్థను రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అదే
సమయంలో మండల విద్యాశాఖాధికారుల (MEO) అధికారాలను పెంచడంతోపాటు, మండలంలోని ఉన్నత
పాఠశాలలపై పర్యవేక్షణాధికారాలను అప్పగించారు. దీనికి సంబంధించి ప్రభుత్వస్థాయిలో
ముసాయిదా సిద్ధమైనట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

COMPLEX HM లను బలో పేతం చేయడంతోపాటు, కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల
పర్యవేక్షణను హెచ్ ఎంలకు అప్పగించనున్నారు. 

ఇక డీఈవోలకున్న అధికారాల్లో దాదాపు 60
శాతం జాయింట్ కలెక్టర్ (DEVELOPEMENT )లకు కట్టబెట్టనున్నారు. ఆ మేరకు టీచర్ల
సస్పెన్షన్, ఎత్తివేత అధికారాలతోపాటు, పలు సర్వీసు సంబంధిత అధి కారాలు, పాఠశాలల
అభివృద్ధి వంటివి జేసీలకు బదలాయించనున్నారు. ఈ నేప థ్యంలో డీఈవోలు ఇక అకడమిక్
సంబంధిత అంశాలకే పరిమితమవుతారు. వీటిపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు
తీసుకోవాల్సి ఉంది. డీవైఈవోల వ్యవస్థను రద్దు చేస్తే జిల్లాలో ఇప్పుడున్న ఇన్
చార్జి డీవైఈవోలంతా వాస్తవ పోస్టులైన ఏడీలుగా ఉంటారు.
Flash...   JagannanaVidyaKanuka– Distribution of School kits – revised orders Issued