విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ తరగతుల వరకు ఆన్‌లైన్‌ పాఠాలు రద్దు

మాయదారి కరోనా వైరస్ కారణంగా పిల్లల చదువులు విషయంలో అనిశ్చితి నెలకొంది. మార్చి
నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ కావడంతో పిల్లలందరూ కూడా ఇంటికే
పరిమితమయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో.. స్కూల్స్, పాఠశాలలు
ఎప్పుడు తెరుస్తారో అన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు
పిల్లలకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు. అయితే ఎల్‌కెజి నుంచి ఐదో తరగతి వరకు
ఆన్‌లైన్ పాఠాలను రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్య మంత్రి
ఎస్. సురేష్ కుమార్ ప్రకటించారు.

ఆన్‌లైన్ తరగతుల వల్ల చిన్న పిల్లలు ఒత్తిడికి గురి కావడమే కాకుండా వారి
ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని, ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూళ్లు
చేస్తున్నారంటూ తల్లిదండ్రులు, సంరక్షకులు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో
ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిలబస్‌లో వెనకబడకుండా ఉండేందుకు అనేక
పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులనే ఎంచుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, ఇతర
విద్యాసంస్థలు మూసివేశారు. కర్ణాటకలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో వీటిని
తిరిగి తెరవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా,
ఆన్‌లైన్ తరగతులకు ఏ పాఠశాల అయినా ఫీజులు వసూలు చేస్తే.. ఖచ్చితంగా భారీ జరిమానా
విధిస్తామని విద్యా శాఖ తాజాగా ఇచ్చిన ఒక ప్రకటనలో పేర్కొంది

Flash...   AP Student Help Line