షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు

షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్:
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ
తేదీ నుంచి 17 వరకూ జరుగుతాయని, సన్నద్ధం కావడంతో పాటు పిల్లల్లో మానసిక
సైర్యాన్ని నింపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
అధికారులను ఆదేశించారు. విజయవాడలోని
సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో
పదో తరగతి పరీక్షల నిర్వహణ, సన్నాహాలపై జిల్లా అధికారులతో పాటు, పాఠశాల
తల్లిదండ్రుల కమిటీలు, మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు,
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చించారు. వారి నుంచి సలహాలు, సూచనలు
తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే… 
#పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్ వినియోగం, థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు
భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
#ప్రతి గదికీ 10 నుంచి 12 మంది విద్యార్థులకు మించకుండా ఉండేలా చూడాలి. 
#రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే విద్యార్థుల విషయంలో రవాణా
సౌకర్యంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
Flash...   ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15వేలు

1 Comment

  1. exams is not important to the life
    life is only one

Comments are closed