ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి… క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

అమరావతి : ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వయోపరిమితిని తగ్గించనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు హల్‌ఛల్ చేస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ వయోపరిమితిని పెంచనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ప్రాతిపదికన ఈ తరహా చర్యలుండవచ్చునంటూ వినిపించింది. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగ సంఘా నేతలు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి విషయంలో ఎటువంటి చర్యలూ లేవని స్పష్టం చేశారు. కాగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలుంటాయని కూడా వెల్లడించారు.

Flash...   SI Exam Results Out: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల .. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే.