ఏపీకి తప్పని కరోనా టెన్షన్: కొత్తగా 657 కేసులు

ఏపీని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది.. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 28,239కి పరీక్షలు నిర్వహించగా 611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 39మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం 657కేసులు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 15252కు చేరింది. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది. గత 24 గంటల్లో 342మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6988 నమోదయ్యింది. మరో 8071మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
గత 24 గంటల్లో 
అత్యధికంగా అనంతపురం జిల్లాలో 118, 
కర్నూలు జిల్లాలో 90, 
తూర్పుగోదావరి జిల్లాలో 80, 
గుంటూరు జిల్లాలో 77, 
కడప జిల్లాలో 60, 
కృష్ణా జిల్లాలో 52, 
చిత్తూరు జిల్లాలో 35, 
నెల్లూరు జిల్లాలో 33, 
ప్రకాశం జిల్లా 28, 
విశాఖపట్నం జిల్లాలో 21, 
పశ్చిమగోదావరి జిల్లాలో 15, 
విజయనగరం జిల్లాలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. 
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2045 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 1689కు చేరాయి. కృష్ణా జిల్లాలో 1519కేసులు ఉన్నాయి.
Flash...   ఈ ఏడాది వేతనాలు 9.5 % పెరగొచ్చు: సర్వే