ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: ఇక కరోనా క్వారంటైన్ కిట్ ఇంటికే…

దేశంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.  కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను కరోనా తీవ్రతను  బట్టి హోమ్ క్వారంటైన్ లేదా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు.  హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు తమకు కావాల్సిన మెడిసిన్స్, శానిటైజర్లు వంటి వాటికోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది.  దీని వలన వీరి నుంచి మరికొంతమందికి కరోనా సోకే అవకాశం ఉంటుంది.  అందుకే ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది.  
హోమ్ క్వారంటైన్ లో ఉండే వాళ్ళకోసం ప్రత్యేకంగా హోమ్ క్వారంటైన్ కిట్స్ ను తయారు చేసింది.  వీటిని హోమ్ క్వారంటైన్ లో ఉండే వారికి అందిస్తున్నారు.  ఈ కిట్ లో కరోనా మెడిసిన్స్, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉపయోగపడే ఆక్సిమీటర్ లు ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉండే వారికి ఈ కిట్లు అందజేస్తున్నారు.  ఒకవేళ తీవ్రత పెరిగితే తప్పనిసరిగా హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది.  
Flash...   AP GOVT. NEW CARONA MOBILE APP SERVICES - COVID-19 AP