కరోనాపై సవాలక్ష డౌట్లు… కంట్రోల్ రూమ్ ఏర్పాటు… ఏం అడుగుతున్నారంటే

తెలంగాణ ప్రభుత్వం… కరోనా వైరస్‌పై ఏవైనా డౌట్లు ఉంటే… కాల్ చెయ్యమంటూ…
కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని చక్కగా
ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎవరికి ఏ చిన్న అనుమానం ఉన్నా… కాల్
చేసి, క్లారిటీ తీసుకుంటున్నారు. చాలా మంది కాల్ చేసి… సార్ మాకు కరోనాపై
అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. చెప్పండి… మీకు ఉన్న అనుమానాలేంటి అని
అడగగానే… సార్… అంటూ… రకరకాల డౌట్లు చెబుతున్నారు. వాటన్నింటికీ కంట్రోల్
రూం సిబ్బంది ఓపికగా సమాధానాలు చెబుతున్నారు. ఇదివరకు జ్వరం, జలుబు, దగ్గు ఉన్న
వారు ఫోన్… నాకు ఇలా దగ్గు వస్తోంది… నాకు కరోనా ఉన్నట్లేనా అని అడిగేవాళ్లు.
నాకు ఇంత జ్వరం ఉంది.. నాకు కరోనా సోకిందంటారా అని అడిగేవాళ్లు. కొంతమంది తమకు
కరోనా లక్షణాలు ఉన్నాయనీ… తమకు దగ్గర్లో కరోనా టెస్టింగ్ సెంటర్ ఎక్కడుందో
చెప్పాలని అడిగేవాళ్లు. ఇప్పటికీ అలాంటి కాల్స్ వస్తున్నాయి.

ఇప్పుడు కొత్తగా మరిన్ని రకాల కాల్స్ వస్తున్నాయి. అవేంటంటే… సార్… మాకు
కరోనా లక్షణాలేవీ కనిపించట్లేదు. కానీ… చుట్టుపక్కల వాళ్లకు కరోనా ఉంది.
కాబట్టి మాకు ఉందంటారా అని అడుగుతున్నారు. అలా ఉండకపోవచ్చు అని సిబ్బంది
చెబితే… మరి మా పక్కింటి వాళ్లకు కూడా ఏ లక్షణాలూ లేకపోయినా… కరోనా వచ్చింది.
అలా మాకూ జరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇలా రకరకాల అనుమానాలతో కాల్స్
చేస్తున్నారు. ఈ కాల్స్‌తోపాటూ… తమకు మందులు కావాలనీ, ఆహారం కావాలని
కంటైన్‌మెంట్ జోన్ల నుంచి వస్తున్న కాల్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. మొదట్లో
రోజుకు 600 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150 దాకా వస్తున్నాయి. ఇప్పటివరకూ
వచ్చిన మొత్తం కాల్స్ 2080 అని సిబ్బంది తెలిపారు.
GHMC పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి… మార్చి 22న
ప్రభుత్వం కోవిడ్ కంట్రోల్ రూంని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఎవరికైనా కరోనా ఉందని
తెలిస్తే… వెంటనే వాళ్లను ఆస్పత్రికి పంపేందుకు అంబులెన్సులను సిద్ధం
చేసేవాళ్లు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా. అలాగే కంటైన్‌మెంట్ జోన్లలో వారి సమస్యలు,
అవసరాలకు స్పందించేవారు. సమయానికి ఆహారం అందిస్తూ… ఆకలి బాధలు తీర్చేవారు.
క్రమంగా కంట్రోల్ రూం‌మ్ బాధ్యతలు పెరగడంతో… ఇప్పుడు మూడు షిఫ్టుల్లోనూ
ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల వారికి ఈ పనులను కేటాయించారు.
అందువల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా, ఏది కావాలన్నా
కంట్రోల్ రూంకి కాల్ చేసి తెలుసుకుంటున్నారు.
Flash...   నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు