కరోనా వైరస్ గురించి బయటపడ్డ కొత్త విషయాలు ఇవే..

ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో పబ్లిష్ అయ్యాయి. ఈ
స్టడీ లో కరోనా సోకి కోలుకున్న వంద మంది పేషెంట్స్ వద్ద నుండి వివరాలు
సేకరించారు. వీరందరూ ఏప్రిల్ 2020 నుండీ జూన్ 2020 మధ్యలో జర్మనీలోని యూనివర్సిటీ
హాస్పిటల్ ఫ్రాంక్ఫర్ట్ నుండి వైద్య సహాయం పొందారు.
ఈ స్టడీ లో పార్టిసిపేట్ చేసిన రిసెర్చర్స్ చెప్పినదాని ప్రకారం 78 మంది
పేషెంట్స్‌లో కార్డియాక్ ఇన్వాల్‌మెంట్ ఉందనీ, అరవై మందికి ఆన్ గోయింగ్ హార్ట్
ఇంఫ్లమేషన్ ఉందనీ తెలిసింది.
పేషెంట్స్ రిపోర్ట్ చేసిన లక్షణాలు ఇంతకు ముందు ఉన్న కండిషన్స్, తీవ్రత, ఒరిజినల్
డయాగ్నోసిస్ టైమ్, ఓవరాల్ కోర్స్ కి ఇండిపెండెంట్‌గా ఉన్నాయని వారు చెప్పారు.
ఈ స్టడీలో రీసెర్చర్స్ నావల్ కరోనా వైరస్ సార్స్-కొవ్-2 ఇంఫెక్షన్ నుండి రీసెంట్
గా రికవర్ అయిన వారిని పరీక్షించారు. ఇది ఆర్టీ-పీసీఆర్ విధివిధానాల ప్రకారం
జరిగింది. ఇందులో పేషెంట్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వద్ద నుండి స్వాబ్
టెస్ట్స్ ద్వారా సేకరించిన వైరస్ ఉనికిని నిర్ధారిస్తారు.
పరిశోధకులు పేషెంట్స్ యొక్క డెమోగ్రాఫిక్ లక్షణాలు, హార్ట్ హెల్త్ యొక్క బ్లడ్
మార్కర్స్, సీఎమార్ స్కాన్స్ ని పరీక్షించారు. ఈ స్టడీలో ఉన్న పేషెంట్స్ లో 53
మంది మగవారు, వారి సగటు వయసు 49 సంవత్సరాలు. ఈ పరిశోధన ప్రకారం 67 మంది ఇంట్లోనే
ఉండి రికవర్ అయ్యారు, 33 మంది మాత్రం హాస్పిటల్ లో చేరవలసి వచ్చింది.
రీసెంట్ గా కొవిడ్-19 నుండి రికవర్ అయిన 100 మంది పేషెంట్స్ లో హార్ట్ స్కాన్
సమయం లో 71 మంది బ్లడ్ సాంపుల్స్ లో మాలిక్యూల్ హై సెన్సిటివిటీ ట్రోపోనిన్
ఉనికిని కనుగొన్నట్లూ, ఐదుగురిలో అది ఎలివేట్ అయినట్లూ సైంటిస్ట్స్ తెలిపారు.
ఈ స్టడీ లో ఉన్న వంద మంది పేషెంట్స్ లో 78 మంది సీఎమార్ స్కాన్ ఫలితాలు
అబ్నార్మల్ గా ఉన్నాయని వారు తెలిపారు. సివియర్ ఫైండింగ్స్ ఉన్న పేషెంట్స్ యొక్క
హార్ట్ టిష్యూ సాంపుల్ ఎనాలిసిస్ లో ఇమ్యూన్ సిస్టం వల్ల ఏర్పడిన యాక్టివ్
ఇంఫ్లమేషన్ కనబడినట్లు వారు చెప్పారు.
Flash...   Cyclone LIVE status
ఈ పేషెంట్స్ కోలుకుంటున్నప్పుడు ఉన్న కార్డియో వాస్క్యులర్ ఇన్వాల్వ్మెంట్
గురించి ఈ స్టడీ యొక్క ఫలితాలు ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఇచ్చాయని కూడా వారు తమ
స్టడీలో పేర్కొన్నారు. ఈ స్టడీకి ఉన్న లిమిటేషన్స్ గురించి మాట్లాడుతూ దీని
ఫలితాలను పద్ధెనిమిది ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పేషెంట్స్ కి అన్వయించకూడదని వారు
తెలిపారు.
అలాగే, ఈ స్టడీ కొవిడ్-19 ఇంఫెక్షన్ తో బాధపడుతున్నవారినీ, లేదా అసింప్టమాటిక్ గా
ఉన్నవారినీ రిప్రజెంట్ చేయదని తెలిపారు.