క్వారంటైన్ నుంచి పారిపోయిన 100 మంది కరోనా రోగులు.. ఏం చేశారంటే..!

అసోంలో కరోనా రోగులు ఆందోళన సృష్టించారు. క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి తప్పించుకున్న దాదాపు 100 మంది కరోనా రోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో నేషనల్ హైవే బ్లాక్‌ అవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాగోలా వారిని అక్కడి నుంచి క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో ఉన్న ఓ క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి కొంతమంది కరోనా రోగులు తప్పించుకొని బయటకు వెళ్లారు. అక్కడి జాతీయ రహదారి మీదకు వెళ్లి తమకు సరైన ఆహారం, నీళ్లు అందించలేదని ఆందోళన చేశారు. అంతేకాదు ఒకే రూమ్‌లో 10 నుంచి 12 మందిని పెడుతున్నారని వారు ఆరోపించారు. విషయం తెలిసిన కామ్‌రూమ్‌ డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్‌, పోలీసులతో ఆ ప్రాంతానికి వెళ్లారు. వారిని క్వారంటైన్‌ సెంటర్‌కి తిరిగి వెళ్లాలని అక్కడ మాట్లాడుకోవచ్చునని సూచించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు సరైన సౌకర్యాలు సమకూర్చేలా చేస్తామని కైలాష్‌ వారికి హామీ ఇవ్వగా.. వారు అక్కడి నుంచి రోగులు క్వారంటైన్ సెంటర్‌కి వెళ్లారు.
ఇక ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ.. కరోనా సెంటర్‌లో రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవచ్చునని సూచించారు. ”మేము వారిని క్వారంటైన్‌కి తీసుకొచ్చేది మిగిలిన వారికి వైరస్ అంటకుండా ఆపేందుకు. ఒకవేళ వారికి నచ్చకపోతే.. ఇంటికి వెళ్లి అక్కడ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండొచ్చు. వైద్య సిబ్బంది వీరి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు సైతం డబ్బులతో చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతున్నా టెస్ట్‌లతో పాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నాం” అని వివరించారు.
Flash...   MLC - East- West Godavari Teachers' Constituency NOTIFICATION