చంద్రుడిపై ఎకరం భూమి కొన్న వ్యాపారి.. రేటు తక్కువే మరి!

బోధ్‌గయకు చెందిన ఓ వ్యాపారి ఎకరం భూమి
కొనడం ద్వారా వార్తల్లోకెక్కాడు. ఎకరం భూమి కొనడం పెద్ద గొప్పా అంటారా..? ఆయన
కొన్నది చంద్ర మండలంపై మరి. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఇటీవల ఆత్మహత్య
చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంతకుముందుచంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. ఈ
వ్యాపారికి వాళ్లే స్ఫూర్తి కావడం విశేషం.
బీహార్‌లోని బోధ్‌గయకు చెందని నీరజ్ కుమార్ అనే వ్యాపారవేత్తకు చంద్రుడిపై అడుగు
పెట్టాలని బలమైన కోరిక. ఆ కోరికతోనే చంద్రుడికి సంబంధించిన అంశాల గురించి ఆరా
తీస్తుండేవాడు. ఈ క్రమంలో చంద్రుడిపై భూమి కొనే అవకాశం గురించి తెలుసుకున్నాడు.
తాజాగా.. తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రుడిపై ఎకరం భూమిని కొన్నాడు. బోధ్‌గయాలో
ఈ ఘనత వహించిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
చంద్రుడిపై భూమి కొనడానికి తాను తక్కువ మొత్తమే చెల్లించానని.. కానీ, ఆ ప్రక్రియ
మాత్రం చాలా క్లిష్టమైనదని నీరజ్ కుమార్ తెలిపాడు. ‘చంద్రుడిపై అడుగు పెట్టాలని
నాకు బాగా కోరిక. అయితే.. అది సాధ్యం కాలేదు. అక్కడ భూమి కొనడంతో ఆ కోరిక
తీర్చుకున్నా..’ అని చెప్పాడు.
‘షారూఖ్ ఖాన్, ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. చంద్రుడిపై భూమిని కొన్న
విషయం వార్తల్లో చదివాను. ఆ విషయం తెలిసిన తర్వాత నేను కూడా దాని గురించి సమాచారం
సేకరించడం ప్రారంభించా. చంద్రుడిపై భూమి కొనడం అనేది ఆన్‌లైన్ ద్వారానే
జరుగుతుందని నాకు తెలుసు. యూఎస్‌కు చెందిన ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’ చంద్రునిపై
భూమిని అమ్ముతుందని తెలుసుకున్నా. గూగుల్ ద్వారా ఆ సొసైటీని సంప్రదించాను’ అని
నీరజ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
అక్టోబర్‌ 2019లో ఎకరం భూమి కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నీరజ్ కుమార్
తెలిపాడు. అందు కోసం తాను రూ.48,000 చెల్లించినట్లు చెప్పాడు. వాటిని డాలర్లలోకి
కన్‌వెర్ట్ చేసినట్లు తెలిపాడు. సంక్లిష్టమైన పేపర్ వర్క్ అంతా ముగిసిన తర్వాత
తనకు భూమి మంజూరీ అయినట్లు జులై 4న మెసేజ్ వచ్చిందని చెప్పాడు. అవకాశం వస్తే..
చంద్రుడి వద్దకు వెళ్లడానికే ఇష్టపడతానని అంటున్న నీరజ్ కుమార్‌కు ఆల్ ది బెస్ట్
చెబుదామా..
Flash...   AP లో 97 రెడ్ జోన్ మండలాలు... ఏయే ఊర్లు ఆ పరిధిలోకి వస్తాయంటే?