డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలు నిర్వహించాల్సిందే.. రద్దు చేస్తే చర్యలు: MHRD

యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే.
ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాల్సిందేన‌ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తేల్చి చెప్పింది.
రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరులోగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని రాష్ట్ర్టాలు కూడా అదే దిశలో అడుగులు వేస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కూడా ఈ సారి పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది.
ఈ రాష్ట్రాల నుంచే అభ్యంతరాలు:
కరోనా నేపథ్యంలో ఆరు రాష్ట్రాలు మాత్రమే ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పంజాబ్‌, మహారాష్ట్ర, ఒడిసా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, న్యూఢిల్లీ మాత్రమే పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు.
Flash...   VIDEO LESSONS TO 10th CLASS STUDENTS THROUGH DOORDARSHAN