ప్లాస్మా డోనర్లకు బంపరాఫర్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం..

దేశంలో COVID -19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా డోనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ రోగుల చికిత్సకు ప్లాస్మాను దానం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అసోం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించేందుకు అసోం సర్కారు వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
దాతలను ప్రోత్సహించడానికి, రాష్ట్రంలో ప్లాస్మా కణాలను దానం చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని, పరిమిత సీట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధించినట్లయితే, ప్లాస్మా దాతకు ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో అదనంగా రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ప్లాస్మా దానం చేసేందుకు అసోం రాష్ట్రానికి వస్తే వారికి విమాన టికెట్లు ఇచ్చి తమ రాష్ట్ర ప్రభుత్వ అతిధులుగా గుర్తిస్తామని మంత్రి తెలిపారు.
Flash...   COVID - 19: ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు