బిగ్ బ్రేకింగ్.. ఏపీలో 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఏపీలో సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లులకు రాష్ట్ర గవర్నర్
బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదముద్రవేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ చట్టం- 2014
రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం
తెలిపారు. దీంతో ఇకపై శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి, పరిపాలనా
(ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు
అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు.
దీంతో ఇకపై రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి. కాగా, జనవరి
20న రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా, శాసనమండలి మాత్రం స్టాండింగ్
కమిటీకి పంపించింది. ఈ తరుణంలో జూన్ 16వ తేదీన నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో
మరోసారి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు రెండో సారి ఆమోదించారు. ఆ తర్వాత
ఈ బిల్లులపై శాసనమండలికి పంపగా అక్కడ ఎలాంటి చర్చ జరగకుండానే నిరవధిక వాయిదా
పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం
లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు
పరిగణిస్తారని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది. గత నెల 17న మండలికి పంపిన ఈ
బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావించింది. దీంతో తుది
ఆమోదానికి గవర్నర్‌కు పంపారు.
మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో పలువరు
వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగుతోంది. ఈ
తరుణంలో ఈ బిల్లులపై సుదీర్ఘంగా న్యాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న గవర్నర్
బిశ్వభూషణ్ హరిందన్ శుక్రవారం (జూలై 31) ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో
శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Flash...   గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..