భూమిపై అటు పగలు, ఇటు రేయి… అంతరిక్షం నుంచి అద్భుతమైన ఫొటోలు

భూభ్రమణాన్ని అనుసరించి భూమిపై రేయి, పగలు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. భూమికి
ఒకవైపున పగటి వేళ అయితే మరో భాగంలో రాత్రి వేళ అవుతుంది. అయితే, అంతరిక్షంలో
పరిశోధనలు చేస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు చెందిన నాసా
వ్యోమగామి బాబ్ బెన్ కెన్ దీనికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను
పంచుకున్నారు.  
భూమికి అటు పగలు, ఇటు రాత్రి, మధ్యలో విభజన రేఖ… అంతరిక్షం నుంచి తీసిన ఈ
ఫొటోల్లో ఎంతో రమణీయంగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే, భూమ్మీద ఉన్నవారెవరూ ఈ
దృశ్యాన్ని వీక్షించే అవకాశం లేదు. కానీ బెన్ కెన్ ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫొటోలతో
ప్రతి ఒక్కరూ ఈ అద్భుతాన్ని చూసే వీలు దక్కింది. ‘భూమిపై పగలు, రాత్రి విభజన ఇలా
ఉంటుంది’ అంటూ తాను తీసిన ఫొటోలను బెన్ కెన్ ట్విట్టర్ లో పోస్టు చేయగా,
ఒక్కరోజులోనే 8 వేల రీట్వీట్లు, 57 వేల లైకులు వచ్చాయి.
Flash...   NAADU - NEDU MOBILE APP and Guidelines