మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయం!

ప్రపంచమంతా కరోనా వ్యాపించి ఉంది.. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ
వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసులు భారీగా
పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలు దాటేసింది.
కరోనా కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధించకతప్పదనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రాలు లాక్ డౌన్
విధించాలనే నిర్ణయంతో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. లాక్ డౌన్ దిశగా
నగరాలు అడుగులు వేస్తున్నాయి.
ఒకవైపు కరోనా టెస్టులు వేగంగా చేపడుతూనే మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న
నగరాలను గుర్తించి లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్,
కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అసోం సహా చాలా రాష్ట్రాల్లో కరోనా భారీగా కరోనా కేసులు
నమోదువుతున్నాయి. వ్యవసాయ పనులు, అత్యవసర సర్వీసులు, సేవలకు మాత్రం మినహాయింపు
ఇస్తున్నాయి.
ఒడిశా రాష్ట్రంలో ఇప్పటివరకూ 15,300 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 10వేల మంది
కోలుకున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కరోనా
కట్టడి దిశగా చర్యలు చేపట్టిన ఒడిశా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు
అమలు చేస్తోంది. కటక్, గంజాం జజ్ పూర్, ఖుద్రా జిల్లాలో 66 శాతం కేసులు ఉన్నాయి.
ఈ నాలుగు జిల్లాల్లోనే జూలై 31 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఇక బిహార్ లోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 21,700 మందికి
పాజటివ్ నిర్ధారించారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్
డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు 16 రోజుల పాటు బిహార్
వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. బెంగళూరులోనూ వైరస్ ఉధృతి ఎక్కువగానే ఉంది.
ఒక్క రోజే 4169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
51 వేలు దాటేసింది. మరణాల సంఖ్య కూడా వెయ్యి దాటేసింది.
Flash...   Independence Day celebrations certain instructions 2021
అప్రమత్తమైన ప్రభుత్వం బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విధించింది. మహారాష్ట్రలోని
పుణెలో కూడా కరోనా విజృంభిస్తోంది. మరణాల్లో దాదాపు 45 శాతం ఒక్క రాష్ట్రంలోనే
నమోదయ్యాయి. రాష్ట్రంలో సడలింపులతో లాక్ డౌన్‌ను 45 శాతం వరకు నమోదయ్యాయి. లాక్
డౌన్ జూలై 31 వరకు పొడిగించింది. పుణెలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. 15 రోజుల
పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. నగరంలో ప్రత్యేకించి 55 చెక్ పాయింట్లను
ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టారు.