విద్యా క్యాలెండ‌ర్ పై విసిల‌తో గ‌వ‌ర్న‌ర్ వీడియో కాన్ఫ్ రెన్స్…

విజయవాడ: రాష్ట్రంలో 20 యూనివర్సిటీల ఉపకులపతులతో రాజభవన్ నుంచి గవర్నర్ విశ్వభూషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో కోవిడ్ 19 మూలంగా ‘ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ళు – నివారణ మార్గాలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. రెగ్యులర్ తరగతులు నిర్వహించలేకపోవడం, యూజీసీ ఆదేశాల మేరకు తుది సంవత్సర పరీక్షలు నిర్వహణ, విద్యాసంవత్సరం ముందుకు తీసుకు వెళ్ళడంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫురెన్స్‌లో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె హెమచంద్రారెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలు పాల్గొన్నారు.

Flash...   విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలి