ఆగష్టు 15లోగా కరోనా వ్యాక్సిన్ లాంచ్.. నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్: ICMR లేఖ

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ పేరిట రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తేనున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ దేశంలోని 12 హాస్పిటళ్లను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఐసీఎంఆర్, పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐసీఎంఆర్ హాస్పిటళ్లను కోరింది.
ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 12 హాస్పిటళ్లలో హైదరాబాద్‌‌కు చెందిన నిమ్స్‌తోపాటు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్, రోహ్‌తక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఒడిశా‌లోని ఐఎంఎస్ అండ్ ఎస్‌యూఎం హాస్పిటల్, కర్ణాటకలోని బెలగావి జీవన్ సుఖీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కాన్పూర్, గోరఖ్‌పూర్, ఆర్యానగర్, కట్టన్‌కులథూర్, నాగపూర్, బెల్గాం, పాట్నాల్లోని హాస్పిటళ్లలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ చేయనున్నారు.
క్లినికల్ ట్రయల్స్‌లో కొవాక్సిన్ అన్ని విధాలా క్షేమకరమని తేలితే.. అన్ని రకాల అనుమతులు వస్తే.. 2021 ఆరంభం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
Flash...   PM Narendra Modi to discuss COVID-19 situation with CMs of all states on July 27