ఇంటర్ కాలేజీల పునః ప్రారంభం , పని దినాలను, సిలబస్‌ కోసం విద్యా రంగ నిపుణుల అభిప్రాయాలు సేకరణ

కరోనా వ్యాప్తి అన్నీ రంగాలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా
విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. మళ్లీ మామూలు స్థితికి రావాలంటే
ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. గాడిలో పెట్టెందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా
పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు సైతం తలలు
పట్టుకుంటున్నారు.
ఇక విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయం.. స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు
ప్రారంభమవుతాయో తెలియదు. ఎప్పుడు అడ్మిషన్లు జరుగుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో
క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ప్రయత్నాలు
ప్రారంభించాయి. పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
అయితే ప్రణాళికల రూపకల్పనలో విద్యార్థులను, తల్లిదండ్రులను, లెక్చరర్లను, విద్యా
రంగ నిపుణులను కూడా భాగస్వాములను చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాలేజీల
పనఃప్రారంభం, పని దినాలను, సిలబస్‌ను కుదించడం, బోధనా పద్ధతుల్ని మార్చడం,
కోర్సుల్లో మార్పులు చేర్పులు వంటి అంశాలపై అన్నీ వర్గాల అభిప్రాయాలను
తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు,
లెక్చరర్లు, విద్యా రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించింది.
ఆసక్తి గల వారు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE)
అధికారిక వెబ్‌సైట్
https://bie.ap.gov.in/ ద్వారా మీ
అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం
తుది నిర్ణయం తీసుకుంటుంది. మీ అభిప్రాయాలను జులై 31, 2020 సాయంత్రం ఐదు
గంటల్లోపు తెలియజేయాలి.
Flash...   School Mapping - Primary/UP Schools – work adjustment of teachers – Instructions