ఇండియాలో మల్టీప్లెక్స్‌లు తెరుస్తారా?..కేంద్రం ఆలోచన ఇదీ

ఎంత ప్రయత్నించినా… ఈ కరోనా ఇప్పట్లో వదిలేలా లేదు. లాక్‌డౌన్ లాంటివి కరోనాను కంట్రోల్ చేయడానికి పూర్తిగా ఛాన్స్ ఇవ్వవు. అందువల్ల ఆర్థిక వ్యవస్థలకే నష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… రైలు, బస్సు ప్రయాణాలు, షాపులు, మార్కెట్లు, ఆఫీసులు, షాపింగ్ కాంప్లెక్సులు తెరిచేందుకు ఒప్పుకున్నాయిగానీ… మల్టీప్లెక్సులు తెరిచేందుకు మాత్రం ఒప్పుకోలేదు. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1.అవి అత్యవసరాలు కాకపోవడం, 2.వాటిలో ఏసీ ఉండి… కరోనా పెరుగుతుందనే ఆలోచన. 3.సోషల్ డిస్టాన్స్ పాటించడం వీలు కాదనే భావన. ఐతే… కంటైన్మెంట్లు కాని ప్రదేశాల్లో మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని మల్టీప్లెక్స్ అసోసియేష్ ఆఫ్ ఇండియా… కేంద్రాన్ని కోరుతోంది. ఇందుకు చాలా దేశాల్లో ఎలాంటి అనుమతులు లభించాయో చెబుతోంది.
ఇప్పటివరకూ ఇటలీ, శ్రీలంక, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, మలేసియా, అమెరికా దేశాల్లో మల్టీప్లెక్సులు తిరిగి ప్రారంభం అయ్యాయి. అక్కడ సోషల్ డిస్టాన్స్ కూడా కచ్చితంగా పాటించేలా చాలా రకాల చర్యలు చేపట్టారు. ఏసీ కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్ల ఆ దేశాల్లో మల్టీప్లెక్సులు తిరిగి రన్ అవుతున్నాయి.
మన దేశంలో మల్టీప్లెక్సులు మూసేయడంతో… సినిమాల రిలీజ్‌కి ఓటీటీ రూట్ వెతుక్కుంటున్నారు నిర్మాతలు. ఐతే… ఓటీటీ అనేది చిన్న సినిమాలకే తప్ప… భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం కలిసిరాదనే అభిప్రాయం ఉంది. పైగా… దేశంలోని మల్టీప్లెక్సుల్లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లంతా… ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారు. మల్టీప్లెక్సుల్ని అనుమతిస్తే… తిరిగి వినోదరంగం గాడిన పడుతుందనే అభిప్రాయం ఉంది.
దేశంలో ఇప్పట్లో కరోనా వదిలే పరిస్థితి లేదు. ఒక వేళ ఇప్పుడు కేంద్రం మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా… వెంటనే ప్రజలు వస్తారన్న గ్యారెంటీ లేదు. వాళ్లు తిరిగి వాటికి అలవాటు పడేందుకు రెండు మూడు నెలలు పట్టొచ్చనే అంచనా ఉంది. దానికి తోడు సీట్ల మధ్య గ్యాప్ ఉండాల్సి రావడం వల్ల… థియేటర్లకు ఆర్థిక భారం తప్పదు. పైగా… శానిటేషన్ కోసం అదనపు ఖర్చులు ఉంటాయి. సినిమా టికెట్ల రేట్లు పెంచితే… ప్రజలు వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఎలాగొలా సెట్ చేసుకుంటామంటున్న మల్టీప్లెక్సులు… అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.
Flash...   బుబోనిక్ ప్లేగు: మొన్న చైనాలో.. తాజాగా అమెరికాలో తొలి కేసు!