న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం
తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం
హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్
వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య
సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
ఆరోగ్య కార్యకర్తలు కాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్95 మాస్కులను ఇష్టం
వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నుంచి
బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను
వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ఇక ఇంట్లొనే మాస్కు ఎలా తయారు
చేయాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శాకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో
ఉంచింది.
ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు
మస్కుల వినియోగంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ ఎస్ ) సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ దేశంలోని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు లేఖ రాశారు. వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులతో పెద్దగా ఉపయోగం లేదని స్పష్టం చేసారు. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్ ను వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులు ఆపలేవని డీజీహెచ్ ఎస్ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం అని దీనితో ఇకపై నోరు ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలని వెల్లడించారు. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసిన నేపథ్యంలో డీజీహెచ్ ఎస్ అన్ని రాష్ట్రాలకి లేఖలు రాసింది.