ఏపీలో ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం

కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్స్ కు తరలిస్తామని కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు వెల్లడించారు. ఇప్పటివరకు 76 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్వాత దశలో ప్రతి జిల్లాలో ఐదు వేల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటి ఏర్పాటుకోసం జిల్లాకు కోటి రూపాయలు కేటాయిస్తామని అన్నారు. ఎక్సరే, అంబులెన్స్, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 74 కోవిడ్ ఆసుపత్రుల్లో 5874 చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. 

కొన్ని కోవిడ్ సెంటర్లల్లో ఫుడ్ బాలేదు అని సీఎం దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు పర్యవేక్షణ భాద్యతలు అప్పగించామని తెలిపారు. బిల్స్ పెండింగులో ఉన్న చోట్ల.. ఈనెల 15 లోపు బిల్స్ పంపించాలని కోరారు. జూన్ 30వరకు సంబందించిన బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని స్పష్టం చేసారు. తన 20 ఏళ్ల సర్వీసులో రోజుకు రూ.500 పేషెంటు కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుండడాన్ని మొదటిసారి చూస్తున్నానని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లల్లో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఫిర్యాదులపై ఈ రోజు కొందరికి మెమోలు ఇస్తున్నామని అన్నారు. 
ఏపీకి 13 నుంచి 15 వేల మంది పైగా ఇతర రాష్ట్రాలు నుంచి వస్తున్నారని తెలిపారు. రోజుకు నాలుగు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా ఏపీకి రావడానికి అవకాశం ఇచ్చినట్టు స్పష్టం చేసారు. విశాఖకు రెండు, విజయవాడలో రెండు ఫ్లైట్లకు అవకాశం ఇచ్చామన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారన్నారు. ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ళు తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Flash...   News Headlines 26.6.20