ఏపీ : క్వారంటైన్ విధానంలో కొత్తరూల్స్

ఏపీ : క్వారంటైన్ విధానంలో కొత్తరూల్స్..హైరిస్క్ ప్రాంతాల్లో కర్ణాటక, టీఎస్.!
క్వారంటైన్ విధానంలో ఆంద్రప్రదేశ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరని తెలిపింది. గల్ఫ్ దేశాల నుండి  వచ్చిన వారికి ఇదివరకు 14 రోజుల క్వారంటైన్ విధించగా ఇప్పుడు 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినవారికి  5వ రోజు, 7 రోజున కోవిడ్ టెస్టు చేయాలని ఆదేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. 
విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలని తెలిపింది. రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారికి చెక్ పోస్ట్ ల వద్దనే స్వాబ్ టెస్టులు చేయాలని ఆదేశించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఈ రెండు రాష్ట్రాలు లోరిస్క్ జాబితాలో ఉండగా కేసుల సంఖ్య పెరిగినందున హై రిస్క్ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు రాష్ట్రాల నుండి వచ్చినవారికి 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్రానికి రావటానికి స్పందన యాప్ లో ఈ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Flash...   కరక్కాయ పౌడర్‌ను నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే?