కరోనాపై విఫలం: ట్రంప్‌పై విరుచుకుపడిన Mark-zuckerberg

కరోనా సంక్షోభంపై ట్రంప్ పరిపాలనా విభాగం స్పందించిన తీరు సరిగ్గా లేదని సోషల్
మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ ఆగ్రహం వ్యక్తం
చేసారు. ఈ సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వం వైఖరిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు దారుణంగా ఉందన్నారు.
ఫేస్‌మాస్కులు ధరించడం వంటి ప్రాథమిక నిబంధనల అమలు కూడా సరిగ్గా లేదని, సమగ్ర
నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలై రెండో దశ కరోనాను నివారించే అవకాశముండేదన్నారు.

డాక్టర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోవట్లేదు
 :
అమెరికా టాప్ అంటువ్యాధుల నిపుణులు
ఆంథోనీఫాసీతో ఇంటర్వ్యూలో జుకర్ బర్గ్ మాట్లాడారు. అసలు అమెరికాలో సరైనన్ని
పరీక్షలు నిర్వహించకపోవడం నిరాశపరిచిందన్నారు. ఫేస్‌బుక్ సీఈవో పేజీలో లైవ్‌లో
మాట్లాడారు. కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం
నిజంగా నిరాశ కలిగించిందని చెప్పారు. ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలు
పాటించడం లేదని, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం:
ఈ తీరు వల్ల దేశంలోని టాప్ సైంటిస్ట్‌లు, సీడీసీ
విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని
అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా కేసులు తక్కువగా ఉంటే అమెరికాలో మాత్రం రోజు
రోజుకు రికార్డ్‌స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. ఈ వ్యాధి నియంత్రణలో అనేక ఇతర
దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని, అమెరికా మాత్రం ఈ విషయంలో వెనుకబడిందన్నారు.

రెండో దశ విజృంభన:
సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి ఇతర భద్రతా చర్యలు
తీసుకోకుండా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేతకు, ఆర్థికకార్యలాపాల
పునరుద్ధరణకు తొందరపడ్డాయని డాక్టర్ ఆంథోనీఫాసీ కూడా అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా
రాష్ట్రాల్లో కరోనా రెండో దశ విజృంభించిందని చెప్పారు. కరోనాపై తన వినియోగదారులకు
విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో
జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా వరుస ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు.
Flash...   ఏపీకి తప్పని కరోనా టెన్షన్: కొత్తగా 657 కేసులు