కరోనా అంతం గురించి ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచంలో ఇప్పటికే 
కోటికి పైగా కేసులు నమోదయ్యాయి.   ఐదు లక్షలకు పైగా   మరణాలు
సంభవించాయి.  కరోనాకు ఖచ్చితమైన వ్యాక్సిన్ వచ్చే వరకు ఇబ్బందులు తప్పవని
నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో  ప్రముఖ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం
ప్రొఫెసర్ సునేత్ర గుప్త  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.   
వ్యాక్సిన్ అవసరం పెద్దగా ఉండబోదని, ఇన్ ఫ్లుఎంజా మాదిరిగానే ఈ వైరస్ కూడా మన
జీవితంలో ఒక భాగమౌతుందని, ఈ మహమ్మారి సహజంగానే అంతం అవుతుందని ఆమె తెలిపారు. 
వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్న వ్యక్తులే  ఎక్కువగా కరోనా బారిన పడ్డారని
అన్నారు.  అందరికి కరోనా వ్యాక్సిన్ అవసరం  ఉండదని, ఎవరైతే వైరస్ కు
ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నదో వారికి మాత్రమే వ్యాక్సిన్ అవసరం అవుతుందని
ఆమె తెలిపింది. 

Flash...   PM-KISAN పథకం : COMPLETE INFORMATION