టిక్‌టాక్‌కు మ‌రోషాక్..

వ‌రుస ఎదురు దెబ్బ‌లు.. టిక్‌టాక్‌కు మ‌రోషాక్..

వ‌రుస ఎదురు దెబ్బ‌లు.. టిక్‌టాక్‌కు మ‌రోషాక్..
టిక్‌టాక్‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.. చైనా వైఖ‌రితో భార‌త్ ఆ
దేశానికి చెందిన 59 సోష‌ల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించ‌గా.. భార‌త
మార్కెట్‌ను కోల్పోయిన టిక్‌టాక్‌కు భారీ షాక్ త‌గిలింది.. ఇక‌, భార‌త్ దారిలోనే
అమెరికా, ఆస్ట్రేలియా సైతం.. టిక్‌టాక్‌పై బ్యాన్ విధించే యోచ‌న‌లో ఉన్నాయి.
భార‌త మార్కెట్ కోల్పోయి ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది టిక్‌టాక్‌.. తాజాగా
హాంకాంగ్‌ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు టిక్‌టాక్‌ ప్రకటించింది.. హాంకాంగ్
స్వ‌యంప్ర‌తిప‌త్తిని కాల‌రాస్తూ చైనా పార్ల‌మెంటు ఇటీవ‌లే జాతీయ భ‌ద్ర‌తా
చ‌ట్టానికి ఆమోదం తెలిపింది.. దీంతో.. హాంకాంగ్‌లో నిర‌స‌న‌లు హోరెత్తాయి..
సోష‌ల్ మీడియాలో చైనా తీరును ఎండ‌గ‌డుతున్నారు నెటిజ‌న్లు.. దీనిని సీరియ‌స్‌గా
తీసుకున్న ప్ర‌భుత్వం హాంకాంగ్‌లో నిర‌స‌న‌ల‌ను అణిచివేసేందుకు టిక్‌టాక్
వినియోగాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వ‌హ‌కుల‌తో
చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తుండ‌గా.
ఈ నేప‌థ్యంలో త‌న‌ కార్య‌క‌లాపాల‌ను
హాంకాంగ్‌లో నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది టిక్‌టాక్‌. దీంతో దాదాపు
ల‌క్ష‌న్న‌ర మంది యూజ‌ర్ల‌ను కోల్పోయింది టిక్‌టాక్‌.. అయితే, ప్ర‌భుత్వ
అభ్య‌ర్థ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోలేద‌ని.. అక్క‌డ
ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని
ప్ర‌క‌టించింది టిక్‌టాక్.
Flash...   ఈ రోజు నుంచి టీచర్లకు టైమింగ్స్ షురూ.. లేట్ అయితే సెలవు నమోదు ..