నెల్లూరులో మ‌హిళా ఉద్యోగినిపై దాడి.. అస‌లు ఏం జ‌రిగింది..?

మహిళా ఉద్యోగులు జాగర్త ! 
నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ లో ఓ ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భౌతిక దాడికి దిగడం
కలకలం రేపింది. ఈ 27వ తేదీన ఏపీ టూరిజం హోటల్ లో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య
గొడవ జరిగింది. సీనియర్ అసిస్టెంట్ అయిన ఉషారాణిపై డిప్యూటి మేనేజర్ భాస్కర్ దాడి
చేశాడు. వికలాంగురాలైన ఉషారాణిని కుర్చీ నుంచి కిందకు పడదోసి కత్తి లాంటి
వస్తువుతో పొడవడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడవున్న తోటి ఉద్యోగి ఓకరు
అడ్డుకున్నారు. అతడిని కూడా నెట్టేసి.. ఆమెను రాడ్ తో చితకబాదాడు. చివరకు మిగతా
ఉద్యోగులు వచ్చి అతనిని బయటకు తీసుకుపోయారు. ఈఘటనపై స్థానిక పోర్త్ టౌన్ పోలీస్
స్టేషన్ లో ఈ నెల 27న ఫిర్యాదు చేసింది ఉషారాణి. అయితే, ఈ కేసు గురించి పోలీసులు
పెద్దగా పట్టించుకోలేదు. 
ఈ నెల 30 వతేదీన  ఎన్టీవీలో స్క్రో ల్ రావడంతోనే డీఎస్పీ అలర్ట్ అయ్యారు.
తర్వాత సీసీ పుటేజ్ కూడా ప్రసారం కావడంతో ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
కలిగించింది. విచక్షణా రహితంగా భాస్కర్ దాడి చేసిన విజువల్స్ ప్రసారం కావడంతో
అందరు అవాక్కయ్యారు. దీంతోవెంటనే భాస్కర్ పై నిర్భయ, వికలాంగుల చట్టం కింద కేసు
నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత మరో రెండు
గంటలకు  డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని
హాజరుపర్చి.. దాడి చేయడం అమానుషమని చెప్పి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు
పంపుతున్నట్లు తెలిపారు. ఒకే ఇష్యూపై.. సీఐ, డీఎస్పీ ఇద్దరూ ప్రెస్ మీట్లు
పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మాస్క్ వేసుకోమని చెప్పినందుకు తనపై దాడి
జరిగిందని ఉషారాణి చెబుతోంది. ఈ నెల 27న అమె ఫిర్యాదు చేసినా.. నిందితుడు భాస్కర్
ను ముందుగా అరెస్ట్ చేయలేదు. కనీసం సీసీ ఫుటేజ్ అదే రోజు ఎందుకు పరిశీలించలేదనే
అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దాడివిజువల్స్ మీడియాలో ప్రసారం కావడం, 
టూరిజం మినిస్టర్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించిన తర్వాతనే భాస్కర్ ను
అరెస్ట్ చేసారనే ప్రచారం జరుగుతోంది.
Flash...   Google డేటా Indian Economy రికవరీపై ఏం చెబుతోంది?