గతం లో ఇచ్చిన పోస్ట్ కి సవరణ
ఈ మధ్య పలు ఫేక్ వార్తలు బాగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటివి నమ్మి ప్రజలు కూడా మోసపోతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని, ఎవరికీ షేర్ చేయవద్దని పేర్కొంది కూడా. అసలు నిజానికి ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో ఎలాంటి ప్రభుత్వ పథకం లేదు. ఆ పథకం గురించి కేంద్రం ఎప్పుడూ.. ఎక్కడా పేర్కొనలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ అసత్యపు పథకం గురించి ప్రచారం జరుగుతూండటంతో.. పీబీఐ అంటే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఈ న్యూస్‌ని ఖండించింది. ఇది పూర్తిగా తప్పుడు వార్తని. ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో అలసు ఎలాంటి పథకం లేదని స్పష్టం చేసింది.