మీకు నచ్చిన 3 మంచి పేర్లు చెప్పండి.. రూ.30,000 పట్టుకెళ్లండి.. ఆదిరిపోయే ఆఫర్!

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తాజాగా
అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఏకంగా రూ.10,000 గెలుచుకునే అవకాశం
కల్పిస్తోంది. ఇన్సూరెన్స్ ప్రొడక్టులకు మంచి పేరు చెబితే డబ్బులు అందిస్తామని
పేర్కొంటోంది. మూడు ప్రొడక్టులకు మూడు పేర్లు చెప్పొచ్చు.
ఐఆర్‌డీఏఐ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌ల పేర్ల కోసం ఈ మేరకు ప్రకటన
ఇచ్చింది. నివాసాలకు పాలసీ కవరేజ్ వర్తించే పాలసీ, చిన్న వాణిజ్య సంస్థలకు రూ.5
కోట్లలోపు బీమా మొత్తానికి పాలసీ, అలాగే వీటికే రూ.50 కోట్ల లోపు బీమా మొత్తానికి
మరో పాలసీ వంటి వాటికి పేర్లు సూచించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్
పెరిల్స్ కేటగిరి కింద పేర్లను తెలియజేవచ్చు. ఒక్కో పేరుకు ఒక్కో కేటగిరి కింద
రూ.10 వేల చొప్పున మొత్తంగా రూ.30 వేలు గెలుచుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ పాలసీ
పేర్లు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
జూలై 10లోపు nl-products@irdai.gov.in ఈమెయిల్ ఐడీకి మంచి పేర్లను మెయిల్
చేయొచ్చు. తర్వాత మీరు పేర్లు పంపించినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అందువల్ల
వెంటనే త్వరపడింది. రూ.10,000 గెలుచుకోవడానికి ప్రయత్నించండి.
విపత్తులు ఇటీవల కాలంలో తరచుగానే సంభవిస్తున్నాయి. మరీముఖ్యంగా ఎక్కువగా వరదలు
వల్ల ఆస్తికి, నివాసాలకు, చిన్న వ్యాపారాలకు భారీ నష్టాలు సంభవించాయి. ఆస్తి బీమా
చేయకపోవడం, తగినంతగా బీమా చేయించుకోకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నాయి.
ఆర్థిక సాయం అందుకోలేపోతున్నారు. అందుకే ఈ మేరకు కొత్త ప్రొడక్టులకు
తీసుకురావాలని యోచిస్తున్నామని, వీటికి సరైన పేర్లు తెలియజేయాల్సిందిగా
కోరుతున్నామని ఐఆర్‌డీఏఐ తెలిపింది.
Flash...   Rural Internship: గ్రామంలో ఉంటూ.. రూ.20 వేలు సంపాదించచ్చు.. అదెలా అంటే..