వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన పవన్…

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలి అంటే మొదట కరోనా రోగులను గుర్తించాలి. వారిని మిగతా వారి నుంచి వేరు చేసి ట్రీట్మెంట్ అందించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉన్నది. ప్రతి రోజు 20వేలకు పైగా టెస్టులు నిర్వహిస్తోంది. 

 అంతేకాదు, ప్రజారోగ్యానికి సంబంధించి వేగంగా స్పందించేందుకు అవసరమైన 108,104 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబుల్పైన్ లో అధునాతనమైన వైద్యపరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వం చూపుతున్న శ్రద్దను ప్రశంసిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. “అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం – అభినందనీయం ..అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు – అభినందనీయం..” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Flash...   ఏపీలో మరో ఉచితం: జగన్ రివ్యూ ఆదేశాలు