వైరల్: బిల్లు 48 డాలర్లు… వెయిటర్ టిప్ 1000 డాలర్లు

కరోనా కాలంలో పది రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు.  ప్రపంచంలో
కరోనా దెబ్బకు కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 
ముఖ్యంగా హోటల్ రంగం ప్రపంచం మొత్తం మీద కుదేలైంది.  సడలింపులు ఇచ్చిన
తరువాత  తిరిగి హోటల్స్ తెరుచుకున్న కస్టమర్స్ చాలా తక్కువ మంది
వస్తున్నారు.  హోటల్స్, రెస్టారెంట్ లు పబ్లిక్ తో సంబంధం ఉన్న రంగాలు
కావడంతో అక్కడ కరోనా వ్యాపించే అవకాశం ఉంటుంది.  అయినప్పటికీ ప్రాణాలకు
తెగించి హోటల్స్ ను రన్ చేస్తున్నారు.  కష్టమర్స్ కు సేవలుఅందిస్తున్నారు
.  
అయితే, అమెరికాలోని ది స్టార్వింగ్ రెస్టారెంట్ అనే హోటల్ కు ఓ కస్టమర్ రెగ్యులర్
గా వస్తుంటారు.  ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వచ్చాడు. 
కావాల్సినవి ఆర్డర్ చేశారు.  వెళ్లే సమయంలో వెయిటర్ బిల్లు ఇచ్చాడు. 
బిల్లు 48 డాలర్లు అయ్యింది.  టిప్ ప్లేస్ లో ఆ కస్టమర్ ఏకంగా వెయ్యి
డాలర్లు రాసిచ్చాడు.  ఆ టిప్ చూసిన వెయిటర్ ఎగిరి గంతేశాడు. 
కష్టకాలంలో వెయ్యి డాలర్ల డబ్బు టిప్ గా వచ్చినందుకు సంతోషం వ్యక్తం
చేశాడు.  ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 
Flash...   AP లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్-ఇక AIIMS లోనూ..