సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

CBSE Board Results: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ వెబ్‌సైట్‌లో చెక్‌
చేసుకోవచ్చు
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు
విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం కేంద్ర సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను విడుదల
చేసింది.
ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలు
పెండింగ్‌లో పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ
షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పరీక్షల ఫలితాలను వెల్లడిస్తోంది. ఈ ఫలితాలపై
విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్లయితే పెండింగ్‌లో ఉన్న పరీక్షలు రాయవచ్చు.
ఇందుకు సంబంధించి బోర్డు షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. ఇక సీబీఎస్‌ఈ 12వ తరగతి
ఫలితాలు సోమవారం (జులై 13) విడుదలైన విషయం తెలిసిందే.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు
రాశారు. ఫలితాలను వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు.
Flash...   HOW TO USE ABHYASA APP - TUTORIAL BY SCERT