125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన

లైబ్రరీ, ఓపెన్
థియేటర్ సహా 
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన
విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విగ్రహానికి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ అంబేడ్కర్
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాబాసాహెబ్ విగ్రహంతో పాటు,
అంబేడ్కర్ స్మారక భవనం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించనున్నట్లు
ప్రభుత్వం ప్రకటించింది.
20 ఎకరాల విస్థీర్ణంలో ఏడాదిలోపు ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం
సన్నాహాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు విశ్వరూప్, ఆదిములపు
సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్,
ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
కాగా, అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌ ఉద్యానవనాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తామని
అధికారులు చెబుతున్నారు. తొలి దశలో 125 అడుగుల ఎత్తయిన భారీ అంబేడ్కర్‌
విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, రెండో దశలో మైదానాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి
చేస్తామన్నారు. అంబేడ్కర్‌ స్మారక కేంద్రం, లైబ్రరీ, అధ్యయన కేంద్రం, ఓపెన్‌
ఎయిర్‌ థియేటర్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నీటి పారుదల
శాఖ ఆధీనంలో ఉన్న భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు బదలాయించినట్లు అధికారులు
తెలిపారు.
Flash...   Online Knowledge Sharing Session - APHRDI TRAININGS