15 న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..

CM-JAGAN

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 15న సమావేశం కానుంది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు
సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై
చర్చించనుంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే
కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13
సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు. కరోనా
కారణంగా కొన్ని వారాల వ్యవధి తరువాత కేబినెట్ సమావేశం జరగనుంది.
Flash...   Traffic Challan: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన ఉందా? ఇలా పేటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు