30 శాతం సిలబస్ కుదింపు

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..30 శాతం సిలబస్ కుదింపు..!
కరోనా విజృంభణ నేపథ్యంలో 30 శాతం సిలబస్ ను తగ్గించేలా పాఠశాల విద్యాశాఖ
స‌మాలోచ‌న‌లు చేస్తోంది. సిలబస్ తగ్గించటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా
తగ్గుతుందని భావిస్తోంది. అంతే కాకుండా పాఠశాల విద్యాసంవత్సరం కూడా ఆగస్టు 3
నుంచి మే రెండో వారం వరకూ ఉండే విధంగా ఆలోచన చేస్తోంది. దాంతో విద్యాసంవత్సరంలో
180 పనిదినాలు మాత్రమే ఉండనున్నాయి. ఈ సారి పండగ సెలవులను కూడా కుదించే ఆలోచనలో
అధికారులు ఉన్నారు. అయితే కరోనా పూర్తిగా తగ్గేవరకు మాత్రం ఆన్లైన్ క్లాసులు
ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులను దూరదర్శన్‌, ఆన్‌లైన్‌, మన
టీవీ ల ద్వారా బోధించనున్నారు. కాగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చిన వెంటనే
యథావిధిగా పాఠశాలలో తరగతులు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇక పదోతరగతి పరీక్షలను
కూడా మార్చి నుంచి ఏప్రిల్‌కు మార్పు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. 2021లో మే
రెండోవారం నుంచి జూన్‌ 12 వరకూ వేస‌వి సెలవులిచ్చి వచ్చే విద్యాసంవత్సరంలో ఎలాంటి
మార్పులు లేకుండా ఉండేదుకు ప్రణాళిక  సిద్ధం చేస్తున్నారు. 
Flash...   AP education Department crucial Decisions