అకడమిక్ క్యాలెండర్‌లోని ప్రధానాంశాలు:
-
అడ్మిషన్ల సందర్భంగా విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి
తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి. -
ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్ హాజరు
నమోదు చేయాల్సిన అవసరం లేదు. -
ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను
రూపొందించుకోవాలి. -
పాఠ్యాంశాలకు ఆన్‌లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్
క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి. -
విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్‌లైన్ సౌకర్యాలు
అందుబాటులో ఉన్న వారు(హైటెక్), రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న
వారు(లోటెక్), కంప్యూటర్ గానీ మొబైల్ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని
వారు(నోటెక్). -
గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో
లేని వారిపైన దృష్టి పెట్టే విధంగా టీచర్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. -
1 నుంచి 5వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల
ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా కృత్యాలు చేయించాలి. -
6 నుంచి 8వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల
ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా
చేయించాలి. -
9, 10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఆన్‌లైన్, రేడియోల ద్వారా
శిక్షణ చేపట్టవచ్చు. - ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు.
-
తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుకోవడానికి టీసీ అడిగితే
ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా అందించాలి. -
వలస కుటుంబాల పిల్లల ప్రవేశాలకు ఐడెంటిటీ నిరూపణ తప్ప ఏ ధ్రువపత్రాలు
అడగకూడదు. -
స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు
వినియోగించుకోవచ్చు. -
ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి.
కానీ అందరూ ఒక్క రోజే హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏ రోజు హాజరు కావాలన్న
విషయమై హెచ్‌ఎం ఉత్తర్వులివ్వాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. -
దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటైన్‌మెంట్ జోన్‌లలో
నివసిస్తున్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, కంటైన్‌మెంట్ జోన్‌లలో
పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. -
కానీ తరగతి వారీగా, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళిక
అమలు చేయాలి. -
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి టీచర్ రోజూ
కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా
కార్యక్రమాల గురించి వివరించాలి. -
మరుసటి రోజు నుంచి ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్ చేసి వారి
పిల్లల పురోగతి తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల
పురోగతి కనుక్కోవాలి. -
టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో
గూగుల్ ఫారంలో అప్‌లోడ్ చేయాలి.
(From date 27/07/2020 to 04/09/2020)
తరగతి వారి కృత్యాలు (with Diksha app links)
1 to 5 అన్ని తరగతులు, అన్ని subjects కు ఒక వారానికి “1st week Model Teacher work done” తయారుచేయడం జరిగింది.