AP: ఆన్‌లైన్‌ క్లాసులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలజడి రేపుతోంది. అయినా
కూడా కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు, ఫీజులు కట్టండి అంటూ
విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పందించారు.
విద్యా సంవత్సరాన్ని ఇప్పటి వరకు ఖరారు చేయలేదని మంత్రి ఆదిమూలపు సురేష్
వెల్లడించారు. కానీ, కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులు
నిర్వహిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు
నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,
ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదన్నారు. నిబంధనలను
అతిక్రమించి ప్రవర్తించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి
హెచ్చరించారు.
జూలై 31 వరకు బడులు తెరిచేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. తర్వాత
కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే స్కూళ్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈ
నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు
ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ అంశాన్ని
ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
Flash...   promotions to the teachers who are identified in excess ratio of 30% under 610