Bengaluru Announces Lock down From July 14 As COVID-19 Cases Rise

Bengaluru: Bengaluru will once again go into a lockdown from 8 pm on July 14 to 5 am on July 22 to slow the spread of the coronavirus, Karnataka Chief Minister BS Yediyurappa said on Saturday. Detailed guidelines of the lockdown will be declared on Monday.
రోజురోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుండ‌డంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంట‌ల నుంచి ఈ నెల 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు సిటీ మరియు బెంగ‌ళూరు గ్రామీణ జిల్లాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. ఈ మేర‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బెంగ‌ళూరు నగరం మరియు దాని పొరుగు గ్రామీణ జిల్లాల్లో ఎలాంటి కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని వెల్ల‌డించారు.. అయితే.. జూలై 11 ఆదివారం నుంచే బెంగళూరు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ కింద‌కి వెళ్తుంద‌ని ఇంత‌కు ముందే నిర్ణ‌యించారు.. 
ఆస్ప‌త్రులు, మెడిక‌ల్ షాపులు, కిరాణా షాపులు, పండ్లు, కూరగాయల షాపులు తెరిచి ఉంటాయి..  ఇక‌, షెడ్యూల్ చేయబడిన వైద్య మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు జరుగుతాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. కాగా, శుక్ర, శ‌నివారం వరుసగా రెండు రోజులు కర్ణాటక, దాని రాజధాని బెంగళూరులో రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం గత 24 గంటల్లో 2,313 కొత్త కరోనావైరస్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసులు 33,418కు చేరుకున్నాయి. మరో 57 మంది మృతిచెంద‌‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 543కు పెరిగింది. బెంగళూరు అర్బన్‌లోనే గత 24 గంటల్లో 1,447 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. దీంతో.. సిటీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసులు 15,329కు చేరాయి
Flash...   SBI సరికొత్త పని విధానం..ఇంటి వద్దకే మనీ ప్రారంభం.