CABINET సమావేశం ముగిసింది . ముఖ్య అంశాలు

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మార్చి 31లోగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని
నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని
సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన
కొత్త జిల్లాలకు సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 
 ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి
31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని మంత్రి మండలి
నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంటు నియోజకవర్గాన్ని సరిహద్దులుగా
తీసుకుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు
పెరగనున్నాయి. 

Flash...   11TH PRC PROPOSALS - MASTER SCALES