CARONA రోగులకు శుభవార్త, మరో ఔషధం వచ్చింది, మరణాలను తగ్గిస్తుంది, ధర కూడా తక్కువే

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని
రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకున్నారు. జనాలు
పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ
విజృంభిస్తోంది. దీంతో మరింతగా భయం పట్టుకుంది. కాగా, ప్రపంచంలో దాదాపుగా 70కి
పైగా రీసెర్చి సంస్థలు కరోనావ్యాక్సిన్ తయారీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కీలకమైన ట్రయల్స్ లో ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు స్పష్టం చేశారు.
కరోనా మరణాలను తగ్గించగల ఔషధం: 
ఈ పరిస్థితుల్లో కరోనా రోగులకు ఓ శుభవార్త వినిపించారు యూకే పరిశోధకులు. కరోనా
మరణాలను తగ్గించగల ఔషధాన్ని వారు గుర్తించారు. ఇప్పటికే యూకేలో నిర్వహించిన
క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయాన్ని గుర్తించారట. ఆ ఔషధం పేరు
డెక్సామెతాసోన్(dexamethasone)‌. ఇదో జనరిక్ స్టెరాయిడ్ డ్రగ్. కరోనా తీవ్రత
ఎక్కువగా ఉన్న పేషెంట్లకు ఈ ఔషధం బాగా పని చేస్తుందన్నారు. ఈ ఔషదాన్ని తక్కువ
మోతాదులో కరోనా పేషెంట్లకు ఇవ్వడం వల్ల మరణాల ముప్పు మూడో వంతు తగ్గుతున్నట్లు
పరిశోధకులు గుర్తించారు. పరిస్థితి విషమించిన కరోనా రోగుల్లో ఈ ఔషధం మెరుగైన
పనితీరు కనబరుస్తోందన్నారు. కరోనా వస్తే చావు తప్పదనే నిరాశ అలుముకున్న వారి
విషయంలో ఇదో గొప్ప ముందడుగుగా పరిశోధకులు అభివర్ణించారు.
ఇక ఈ ఔషధం చౌక ధరలో అందుబాటులో ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్
యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ ల్యాండ్రీ తెలిపారు. ఈ కరోనా మరణాల రేటును
తగ్గించే ఔషధం ఇదొక్కటేనని, మరణించే ముప్పును ఇది గణనీయంగా తగ్గిస్తోందని
పరిశోధనల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త పీటర్ హార్బీ తెలిపారు.

ధర చాలా తక్కువ, పైగా విస్తృతంగా అందుబాటులో ఉంది:
dexamethason. ఈ స్టెరాయిడ్ ధర చాలా తక్కువ. పైగా విస్తృతంగా అందుబాటులో ఉంది.
శరీరంలో మంటను బాగా తగ్గిస్తుంది. తద్వారా తీవ్రమైన COVID-19 ఉన్న రోగుల్లో
మరణించే ప్రమాదాన్ని మూడవ వంతు తగ్గిస్తుంది. ఈ పరిశోధనల తాలూకు ఫలితాలను న్యూ
ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్(NEJM) లో పబ్లిష్ చేశారు. కాగా, కరోనా తీవ్రత
అధికంగా ఉన్న రోగుల్లో(వెంటిలేటర్ పై ఉన్నవారు) మాత్రం ఇది మంచి ఫలితాలు
చూపించినట్టు పరిశోధకులు తెలిపారు.
Flash...   UGC NET 2020 అర్హత పరీక్షలను మరోసారి వాయిదా