Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఫ్రీగా తెలుసుకోండి ఇలా..


పర్సనల్ లోన్‌కు అప్లై చేశారా? ఇల్లు కట్టేందుకు రుణం తీసుకుంటున్నారా? మీరు
ఏదైనా లోన్ లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ ఎంతో
తెలుసుకోవడం మంచిది. 
ఇప్పటికే లోన్లు తీసుకున్నవారు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని
ఉంటే వారి క్రెడిట్ స్కోర్‌కు ముప్పేమీ లేదు. కొత్తగా లోన్లు దరఖాస్తు చేసేవారు
మాత్రం క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకుంటేనే మీ
ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డులో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించొచ్చు. క్రెడిట్ స్కోర్
తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఖర్చు కూడా కాదు. ఉచితంగానే క్రెడిట్ స్కోర్
తెలుసుకోవచ్చు. భారతదేశంలో సీఆర్ఐఎఫ్ హైమార్క్, ఈక్విఫ్యాక్స్, ఎక్స్‌పీరియన్,
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్స్ ఇస్తుంటాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నియమనిబంధనల ప్రకారం క్రెడిట్ బ్యూరో సంస్థలు
ప్రతీ క్యాలెండర్ ఇయర్‌లో ఒకసారి వినియోగదారులకు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్
ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువసార్లు క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే డబ్బులు
చెల్లించాల్సి ఉంటుంది. సీఆర్ఐఎఫ్ హైమార్క్ రూ.399, ఈక్విఫ్యాక్స్ రూ.472 చొప్పున
ప్రతీ రిపోర్ట్‌కు వసూలు చేస్తాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ క్రెడిట్ బ్యూరో
నెలకు రూ.550, ఏడాదికి రూ.1,200 వసూలు చేస్తుంది. ఎన్నిసార్లైనా రిపోర్ట్
తెలుసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్ మాత్రం ఉచితంగానే క్రెడిట్ రిపోర్ట్స్ఇస్తోంది.
కనీసం ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది.
మీరు ఆన్‌లైన్‌లో క్రెడిట్ రిపోర్ట్ తెలుసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్
అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత మీ పాన్ కార్డ్,
పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు వెల్లడిస్తే చాలు. పోస్టు ద్వారా క్రెడిట్
రిపోర్ట్ కావాలంటే డీడీ తీసి పంపాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే
లోన్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు
పరిశీలించే ముఖ్యమైన అంశాల్లో క్రెడిట్ స్కోర్ కూడా ఒకటి. అయితే క్రెడిట్ స్కోర్
బాగున్నంత మాత్రానా లోన్ తప్పకుండా వస్తుందని కాదు. లోన్ వచ్చే అవకాశాలు మాత్రం
ఎక్కువ ఉంటాయి.
Flash...   Good sleep: సుఖమైన నిద్ర కోసం ఇలా చేయండి.
మీకు ఇప్పటి వరకు క్రెడిట్ స్కోర్ లేదు అంటే ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేనట్టే.
అంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తీసుకోకపోతే క్రెడిట్ స్కోర్ ఉండదు.
గత పదేళ్లుగా మీరు ఎలాంటి లోన్ తీసుకోకపోయినా మీకు క్రెడిట్ స్కోర్ ఉండదు. (Source:
Money control)